కృష్ణా జలాల విచారణ వచ్చే నెలకు వాయిదా

కృష్ణా నది జల వివాదంపై ఢిల్లీలోని కృష్ణా ట్రిబ్యునల్ లో రెండో రోజు వాదనలు ముగిశాయి. కేసు తదుపరి విచారణను నవంబర్ 15, 16, 17 తేదీలకు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పని చేసిన సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావును ఆయన క్రాస్ ఎగ్జామిన్ చేశారు. నవంబర్ 15, 16, 17 తేదీల్లో విచారణ సందర్భంగా కేవీ సుబ్బారావు ను వైద్యనాథన్ మరోసారి క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.