కువైట్ లో 15 మంది భారతీయులకు ఉరిశిక్ష రద్దు

కువైట్‌ జైళ్లలో ఉరిశిక్ష పడిన 15 మంది భారతీయుల శిక్షను అక్కడి రాజు రద్దు చేసినట్టు  కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 15 మంది శిక్షను జీవిత ఖైదుగా మార్చారని చెప్పారు. కువైట్‌ లో ఖైదీలుగా ఉన్న మరో 119 మంది భారతీయుల శిక్షలను కూడా తగ్గించడానికి కువైట్‌ రాజు అంగీకరించినట్టు ఆమె చెప్పారు. భారత ఖైదీల శిక్షలను తగ్గించడంపై సంతోషం వ్యక్తం చేసిన సుష్మాస్వరాజ్‌.. కువైట్‌ రాజుకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి జైళ్ల నుంచి విడుదల కాబోయే వారికి.. భారత రాయబార కార్యాలయం సహకారం అందిస్తుందని తెలిపారు.