కార్మికుల పక్షపాతి వెంకటస్వామి

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు వెంకటస్వామి జయంతి వేడుకలు హైదరాబాద్‌ లో ఘనంగా జరిగాయి.  ట్యాంక్‌ బండ్‌ పై కాకా విగ్రహం వద్ద జరిగిన వేడుకలలో మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీలు డీఎస్‌, దత్తాత్రేయతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్‌, రాష్ట్ర మాజీ మంత్రి వినోద్‌, పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పేదలు, కార్మికుల పక్షపాతిగా వెంకటస్వామి బతికారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరంగా కృషి చేశారని మంత్రి పోచారం, డీఎస్‌, దత్తాత్రేయ చెప్పారు. నాన్న చూపిన బాటలో నడిచి.. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని వివేక్‌, వినోద్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ ట్యాంక్‌ బండ్‌ పై కాకా విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.