కామన్ వెల్త్ పార్లమెంటరీ సదస్సుపై భేటి

కామ‌న్ వెల్త్ పార్లమెంట‌రీ స‌ద‌స్సు-2017 స‌న్నాహ‌క స‌మావేశం ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల నుంచి అసెంబ్లీ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్లు, అసెంబ్లీ సెక్రటరీలు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి శాస‌న స‌భ స్పీక‌ర్ మ‌ధుసూద‌న చారి, శాస‌న మండ‌లి చైర్మన్ స్వామి గౌడ్, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచారి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. భారత దేశం త‌రుపున లేవ‌నెత్తవ‌ల‌సిన ముఖ్య అంశాల‌పై చర్చ జరుగుతున్నది.

63వ కామ‌న్ వెల్త్ పార్లమెంట‌రీ స‌ద‌స్సు-2017 వ‌చ్చేనెల 1వ తేదీ నుంచి 8 వ తేదీ వ‌ర‌కు బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకాలో జ‌ర‌గ‌నున్నది. ఈ సదస్సులో దాదాపు 54 దేశాల‌కు చెందిన సుమారు 5 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. ప్రజాస్వామ్య, పార్లమెంట‌రీ పద్ధతుల బ‌లోపేతానికి ప్రపంచ దేశాలు అనుస‌రించాల్సిన విధానాలపై చర్చ జరగనున్నది.