కరీంనగర్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

కరీంనగర్ లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని కోతి రాంపూర్ లో గాంధీజీ విగ్రహానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు.  గాంధీజీ కలలు గన్న అంటరానితనం నిర్మూలన, గ్రామ స్వరాజ్యం, అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఈటల రాజేందర్  స్పష్టం చేశారు.