ఐదుగురిని కిరాతకంగా హత్య చేసిన దుండగులు

ఢిల్లీలో ఘోరం జరిగింది. షహాదరా మానసరోవర్  దగ్గర ఐదుగురిని కిరాతకంగా హత్య చేశారు దుండగులు. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డును సైతం హత్య చేశారు.  మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. మరొకరు సెక్యూరిటీ గార్డు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు.