ఐటెం సాంగ్ లో డీజే బ్యూటీ

న‌టుడు రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్రం రంగస్థలం కోసం ఓ ప్రత్యేకమైన సాంగ్‌ను చిత్రీకరించనున్నారని స‌మాచారం.. సహజంగా తనసినిమాల్లో ఐటెం సాంగ్స్‌కు స్పెషల్‌ ఇంపార్టెన్స్‌ ఇస్తుంటారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌.. ఇందులో ఒక అద్భుతమైన ఐటెం సాంగ్‌ కూడ ఉందట.. ఈ పాటలో రామ్‌చరణ్‌తో సమానంగా డ్యాన్స్‌చేసి అలరించగల అందగత్తె కోసం కొన్ని వారాలుగా దర్శకుడు సుకుమార్‌ వెతుకుతుండగా, ఆ అవకాశాన్ని దువ్వాడ జగన్నాధం బ్యూటీ పూజా హెగ్డేకు అందించినట్టు తెలుస్తోంది..డిజెలో పూజా డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ను చూసిన సుకుమార్‌..చెర్రీ పక్కన అలరించే డ్యాన్స్‌ చేసేందుకు ఆమె అయితే కరెక్టు జోడీ అని ఫిక్స్‌ అయ్యారట.. త్వరలోనే ఈ స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరణ ప్రారంభం కానుండగా, ఇప్పటికే పూజా హెగ్డేతో అగ్రిమెంట్స్‌ పూర్తయ్యాయని స‌మాచారం.