ఎక్సైజ్  శాఖలో మరో అవినీతి చేప

ఎక్సైజ్  అసిస్టెంట్  కమిషనర్  శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఏడు ప్రాంతాలతో పాటు కరీంనగర్ లో మూడు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం పది బృందాలు ఇందులో పాల్గొన్నాయి. అటు, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారానికి సంబంధించి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.