ఉద్యమం కేసులో రైల్వేకోర్టుకు స్పీకర్

తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన రైల్ రోకో కేసు విచారణకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి సహా తొమ్మిది మంది కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఆనాటి ప్రభుత్వం అణచివేత ధోరణితో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తున్న వారిపై అక్రమంగా తప్పుడు కేసులు నమోదు చేసిందని స్పీకర్ విమర్శించారు. చట్టాలను గౌరవిస్తూ కోర్టుకు హాజరవుతున్నామని చెప్పారు. కేసు విచారణ తిరిగి ఈ నెల 23 కు వాయిదా పడింది.