ఈ నెల 13 న పెట్రోల్‌ బంక్‌ల బంద్‌

ఈనెల 13న దేశవ్యాప్తంగా ఒక రోజు పెట్రోల్‌ బంకుల బంద్‌ పాటించనున్నాయి. దేశంలో ఉన్న 3 ప్రధాన యూనియన్‌లు ఏకమై యునైటెడ్‌ పెట్రోలియం ఫ్రంట్‌  U.P.F గా ఏర్పడి ఈ నిర్ణయం తీసుకున్నాయి. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా పెట్రోల్‌ డీలర్లు ఏకమయ్యారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వరంగ చమురు కంపెనీలు శ్రద్ధచూపడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే  ఈనెల 27 నుంచి డీలర్లు ఆయిల్‌ కంపెనీల నుంచి కొనుగోళ్లు కూడా బంద్‌ చేస్తామని హెచ్చరించారు.