ఇషిగురోకు నోబెల్ పురస్కారం

బ్రిటీష్ రచయిత కజువో ఇషిగురోకు సాహిత్యంలో అత్యున్నత పురస్కారం లభించింది. ‘ది రిమైన్స్ ఆఫ్ ది డే’ నవలకు గాను నోబెల్ ప్రైజ్‌ దక్కింది. ఇదే నవలకు బుకర్‌ ప్రైజ్‌ కూడా వచ్చింది. 62 ఏళ్ల ఇషిగురో… జపాన్ లోని నాగసాకిలో జన్మించారు. ఆ తర్వాత 1960లో ఆయన కుటుంబం ఇంగ్లాడ్‌కు వలస వెళ్లింది. ఈయన రాసిన 8 నవలలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి. ది రిమెయిన్స్ ఆఫ్ ది డే తో పాటు ది బరీడ్ జెయింట్ నవలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.