ఆస్ట్రేలియాలో అదానీ మైనింగ్స్‌కు వ్యతిరేకంగా ఆందోళన

ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల వ్యాపారం చేస్తున్న భారత వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీకి షాక్‌ తగిలింది. ఆయన నిర్వహిస్తున్న గనులను రద్దు చేయాలంటూ ఆస్ట్రేలియన్లు ఆందోళనకు దిగారు. ఆ దేశ ప్రభుత్వం…అదానీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సిడ్నీలోని బొండి బీచ్‌ లో స్టాప్‌ అదానీ పేరుతో ప్రొటెస్ట్ చేశారు. స్టాప్ అదానీ అంటూ మానవహారం చేసి నినాదాలు చేశారు. ఆస్ట్రేలియాలో మైనింగ్ కారణంగా కాలుష్యం పెరుగుతోందని జనం కొంతకాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.