ఆలంపూర్ లో పొంగిపొర్లుతున్న వాగులు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు మండలాల్లోని గ్రామాలకు వెళ్లే వంతెనలపై నుంచి నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇటు మానవపాడ్‌ మండల కేంద్రం ప్రధాన రహదారిపై నుంచి నీరు ఉధృతంగా పారుతుండటంతో రాకపోకలకు  అంతరాయం ఏర్పడింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటుతున్నారు.