ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సిద్ధం!

ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించినా పోటీకి సిద్ధంగా ఉన్నామని డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ ఎంకే స్టాలిన్ చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు ఎన్నిక నిర్వహిస్తామని నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీలో చెప్పిన నేపథ్యంలో చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తమిళనాడు సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు ఎన్నిక నిర్వహిస్తామని పేర్కొన్నది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఈ అంశంపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికను వీలైనంత త్వరగా నిర్వహించాలని గత నెలలోనే మద్రాస్‌ హైకోర్టు ఈసీని ఆదేశించింది. దీంతో ఈ ఏడాది పూర్తయ్యే లోపే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ డిసైడైంది.

వాస్తవానికి ఈ యేడాది ఏప్రిల్‌లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోలింగ్ కు రెండు రోజుల ముందు.. ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ఎలక్షన్ వాయిదా వేశారు.