ఆరుషి హత్య కేసులో ఇవాళ తీర్పు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో కాసేపట్లో అలహాబాద్ కోర్టు తీర్పు వెలువరించనుంది. 2008లో నోయిడాలోని తన ఇంట్లో ఆరుషి హత్యకు గురైంది. ఈ కేసులో మొదట ఆ ఇంటి పని మనిషి హేమరాజ్ ను అనుమానించినప్పటికీ…అతను కూడా రెండు రోజుల తర్వాత శవమై కనిపించాడు. దీంతో సుధీర్ఘ విచారణ అనంతరం ఆరుషిని ఆమె తల్లిదండ్రులే హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో సీబీఐ కోర్టు వారిద్దరికి జీవిత ఖైదు విధించింది. అయితే సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆరుషి పేరెంట్స్ అలహాబాద్ కోర్టును ఆశ్రయించారు.