ఆదిలాబాద్ లో పత్తి కొనుగోలు ప్రారంభం

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులను సన్మానించిన మంత్రి.. రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేశారు. పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్న రామన్న, రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.