అభివృద్ధి పనులు, ఇళ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్

సూర్యాపేట జిల్లా వట్టి కంపాడ్ లో 400 కేవీ సబ్ స్టేషన్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రూ.1600 కోట్ల ఖర్చుతో ఈ సబ్ స్టేషన్ ను నిర్మించారు. ఆ తర్వాత చందుపట్లలో మిషన్ భగీరథ ట్రీట్ మెంట్ ప్లాంటుని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్ నుంచి 60 గ్రామాలకు ఇంటింటికి తాగునీరు సరఫరా చేయనున్నారు. సూర్యాపేటలో ఆర్యవైశ్య సంఘం నేత, స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రసేన్ గుప్త విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. యాదవ నగర్ లో 200 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. వాటిలో లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు.