అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి

రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేలు చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసులు వేస్తున్నాయని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కుర్‌ లో పర్యటించిన ఆయన.. యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ ను సన్మానించారు. దేశ చరిత్రలో యాదవులకు గొర్రెలను పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందని చెప్పారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లివ్వనున్నామన్న ఆయన.. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరాకు 8 వేల రూపాయలు పెట్టుబడి ఇవ్వనున్నట్లు చెప్పారు.