అందాలను ఆరబోసిన లక్ష్మీరాయ్

తమిళ, తెలుగు ప్రేక్షకులకు లక్ష్మీ రాయ్‌ బాగా తెలుసు. చిన్న వయసులో నాయికగా మారింది ఈ సుందరి. ‘కాంచన’ లాంటి చిత్రాలతో రెండు భాషల్లో విజయాలు అందుకుంది. ఎక్కువగా భయానక చిత్రాల్లోనే నటించింది. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న బాలీవుడ్‌ అవకాశం ‘జూలీ 2’ చిత్రంతో తమిళ సుందరి లక్ష్మీరాయ్‌కి దక్కింది. వచ్చిందే తడవుగా అందాలు ఆరబోసి…అందరి దృష్టినీ ఆకర్షించింది. అప్పటిదాకా కనిపించని తీరుగా ఈత దుస్తుల్లో స్వేచ్ఛగా నటించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను చూసి దక్షిణాది ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇక బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ తమకు పనికొచ్చే మరో నాయిక దొరికిందని భావించారు. ప్రచారంలో వచ్చిన పేరు…చిత్రం విడుదలయ్యాక పెరుగుతుందని లక్ష్మీ రాయ్‌ ఆశించింది. అయితే ఈ కలలన్నీ చెదిరిపోయాయి. ప్రణాళిక ప్రకారం ఈ నెల 6న ‘జూలీ 2’ విడుదలవ్వాల్సి ఉండగా…కాపీ రైట్‌ వివాదాల కారణంగా చిత్ర విడుదల ఆగిపోయింది. ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని కూడా నిర్మాతలు చెప్పే పరిస్థితులు లేవు. దీంతో బాలీవుడ్‌లో మెరవాలన్న లక్ష్మీ రాయ్‌ కోరిక సందిగ్ధంలో పడింది.