AIDMK నుంచి శశికళ తొలగింపు

మన్నార్ గుడి మాఫియాకు భారీ షాక్ ఇచ్చింది పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గం. శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి తొలగిస్తూ పార్టీ సర్వ సభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను  తొలగించడంతో పాటూ పార్టీలో దినకరన్ చేపట్టిన నియామకాలన్నీ చెల్లవంటూ తీర్మానం ఆమోదించింది అన్నాడీఎంకే. ఇక రెండాకుల గుర్తు కూడా తమకే చెందుతుందంటూ మరో తీర్మానం చేసింది అన్నాడీఎంకే. పార్టీ అధికారాలన్నింటిని మార్గదర్శక కమిటీ అప్పగిస్తూ కూడా తీర్మానించారు. సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలో మార్గదర్శక కమిటీ పని చేయనుంది. రాయల్ పేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.