6 నెలల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ 

వచ్చే ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే కాకుండా ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలను అందిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 49వ స్కోచ్ సమ్మిట్ సందర్భంగా ప్రముఖ స్కోచ్ సంస్థ.. ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో కేటీఆర్‌ను సన్మానించి పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి రాష్ట్రంగా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ఇంటింటికీ అందిస్తున్నామని చెప్పడానికి గర్వకారణంగా ఉందన్నారు. ప్రత్యేకంగా బ్రాడ్ బ్యాండ్ కోసం చర్యలు తీసుకోకుండా.. ప్రణాళికతో ఉన్న వాటినే ఉపయోగించి ముందుకు వెళ్లామని తెలిపారు. ఇటువంటి ఆలోచనలే.. ఇంకా దేశవ్యాప్తంగా రావాల్సిన అవసరం ఉందన్నారు.