5న నిమజ్జనం సెలవు

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చతుర్థి సందర్భంగా 5న నిమజ్జనం చేయాలని నిర్ణయించడంతో ఈ మేరకు సెలవు ఇచ్చింది.  హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలకు మాత్రమే ఈ సెలవు వర్తిస్తుంది. 5వ తేదీన సెలవుకు బదులు ఈ నెల 9న రెండో శనివారం పనిదినంగా ప్రకటించింది.