33 అంశాల్లో అభ్యంతరాలు ఉన్నాయి

జీఎస్టీ విషయంలో తెలంగాణ రాష్ర్టం తరపున 33 అంశాల్లో అభ్యంతరాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జీఎస్టీ సమావేశం ప్రారంభం కంటే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను జీఎస్టీని రెండేళ్ల పాటు మినహాయించాలని కోరుతామన్నారు. సమస్యలన్నింటినీ జీఎస్టీ ముందు ఉంచుతామని చెప్పారు. 12 శాతం జీఎస్టీతో కొన్ని వర్గాలు, రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రభుత్వం గట్టిగా పట్టుబడుతుందన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా జీఎస్టీ 21వ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ప్రారంభం కానుంది.