24న న్యూజిలాండ్ లో బతుకమ్మ వేడుకలు

న్యూజిలాండ్ బతుకమ్మ వేడుకల పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్ లో న్యూజిలాండ్ ప్రతినిధులు ఎంపీ కవితను కలిశారు. ఈ నెల 24న న్యూజిలాండ్ దేశం ఆక్లాండ్ నగరం మౌంట్ ఈడెన్ హాల్ లో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఎంపి కవిత న్యూజిలాండ్ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల వాసులను కూడా ఆహ్వానించాలని ప్రతినిధులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ శాఖ ప్రతినిధులు రాంరెడ్డి, రాజీవ్ రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, యూత్ రాష్ట్ర కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్, దూసరి బాలాజి పాల్గొన్నారు.