21 నుంచి గ్రూప్-2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్

ఈ నెల 21 నుంచి గ్రూప్-2 క్వాలిఫైడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. త్వరలోనే ర్యాంకుల వారీగా వెరిఫికేషన్ తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. కొందరు అభ్యర్థులు హైకోర్టులో కేసు వేయడంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిలిపివేయగా.. కోర్ట్ అనుమతించడంతో టీఎస్సీపీఎస్సీ ముందుకెళ్తోంది.

వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు సిద్ధంగా ఉంచుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ని నిర్ధారించే సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ లేదా ఎస్.ఎస్.సి, స్కూల్ స్టడీ సర్టిఫికెట్, కుల ద్రువీకరణ పత్రం, ఓబీసీ అభ్యర్థులు నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్, రెసిడెన్స్ లేదా నేటివిటీ, అంగ వైకల్యాన్ని తెలిపే (సదరం) సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం తీసుకురావాలని టీఎస్పీఎస్సీ సూచించింది. నిర్ణీత సర్టిఫికెట్లు తీసుకురాని అభ్యర్థులను పరిగణలోకి తీసుకోరని, అదనపు సమయం కూడా ఇవ్వరని టీఎస్పీఎస్సీ సెక్రటరీ వాణిప్రసాద్ స్పష్టం చేశారు.