15 వరకు ఎడ్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్

రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఎడ్‌సెట్-2017 వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి 13 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. రాష్ట్రంలోని 174 బీఎడ్ కాలేజీల్లో 14,800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటాలో 11,100 సీట్లు, యాజమాన్య కోటాలో 3,700 సీట్లు ఉన్నాయి. మరికొన్ని కాలేజీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే 11 బీఎడ్ కాలేజీలపై రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.