హైదరాబాద్ లో అమెజాన్ సెంటర్ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీ దేశ విదేశీ కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ లో పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నాయి. తాజాగా ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ శంషాబాద్ లో భారీ ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ ను నెలకొల్పింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌ రంజన్ ఈ సెంటర్ ను ప్రారంభించారు. తొమ్మిది ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ లో చిన్న, మధ్య తరహా, స్థానిక ఉత్పత్తులను కూడా అమెజాన్ విక్రయించనుంది. తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారంతోనే అతి పెద్ద వేర్ హౌజ్ ఏర్పాటు చేశామని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా చెప్పారు.