హైదరాబాద్‌లో 20 వేల షెల్ కంపెనీలు

హైదరాబాద్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌(ఆర్‌ఒసి)లోనూ పెద్ద సంఖ్యలో షెల్ కంపెనీలు బయట పడ్డాయి. దీంతో 20,082 కంపెనీల పేర్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ జాబితా (రిజిస్టర్‌) నుంచి తొలగించింది. హైదరాబాద్‌ ఆర్‌ఒసి వెబ్‌సైట్‌లోనూ ఈ కంపెనీల జాబితా ఉంచారు. నోట్ల రద్దు సమయంలో నల్ల ధనాన్ని తమ బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్‌ చేయడంతో పాటు, అక్రమ నగదు లావాదేవీలకు ఈ కంపెనీలు సహకరించాయనే ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.