హైదరాబాద్‌ను కమ్మేసిన కారు మబ్బులు

తెలంగాణ, రాయ‌ల‌సీమ‌ ప్రాంతాల మీదుగా ఉప‌రిత‌ల ద్రోణి కొన‌సాగుతున్న‌ది. దీని ప్రభావంతో ఇవాళ‌, రేపు తెలంగాణలో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మ‌రోవైపు ద్రోణి ప్ర‌భావం వ‌ల్ల హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌లో మేఘాలు ద‌ట్టంగా అలుముకున్నాయి. ఉప్ప‌ల్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో దట్టమైన మేఘాల వ‌ల్ల అంధ‌కారం అలుముకున్న‌ది. ఎల్బీ న‌గ‌ర్‌, హ‌య‌త్‌న‌గ‌ర్‌లో సహా పలు ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డుతున్న‌ది. ట్యాంక్‌బండ్‌పై భారీ గాలులు వీస్తున్నాయి.