హిజ్బుల్  టాప్ కమాండర్‌ హతం

జమ్మూ కాశ్మీర్  లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్  ముజాయిద్దీన్   కు మరో ఎదురు దెబ్బ తగిలింది. నిన్న షోపియన్  జిల్లాలో ఆర్మీ వాహనంపై దాడి చేసిన కాశ్మీర్  టాప్  కమాండర్‌ తారిఖ్  బట్‌  ను జవాన్లు కాల్చి చంపారు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వీరు లష్కరే తొయిబాకు చెందిన ఆదిల్‌  దార్‌, మహ్మద్  అల్తార్  రాధర్‌ లుగా గుర్తించారు. ఘటనాస్థలిలో సర్చ్‌  ఆపరేషన్  కొనసాగుతోంది.