హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు పదోన్నతి

మహిళా క్రికె టర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు పదోన్నతి లభించింది. పశ్చిమ రైల్వేలో చీఫ్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా ముంబైలో పనిచేస్తున్న ఆమెకు ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా పదోన్నతి కల్పించారు. జూలైలో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ర్టేలియాపై అద్భుతంగా ఆడి (115 బంతుల్లో 171 నాటౌట్‌) టీమిండియాను ఫైనల్‌కు చేర్చడంలో హర్మన్‌ కీలక  పాత్ర పోషించింది. ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత జట్టులో కెప్టెన్‌ మిథాలీరాజ్‌ సహా 10 మంది రైల్వే ప్లేయర్లున్నారు.