హనీప్రీత్‌ ప్రాణాలకు ముప్పు!

రేప్‌ కేసులో దోషిగా తేలి.. జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్‌ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. డేరా బాబా అసాంఘిక కార్యకలాపాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆమెను మట్టుబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇంటలిజెన్స్‌ బ్యూరోకు సమాచారం అందింది. దీంతో  హరియాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం కనబడకుండా పోయిన హనీప్రీత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐతే ఆమెను అరెస్టు చేసి రహస్య విచారణ జరుపుతున్నట్లు వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు. గత నెల 25న ఆమె గుర్మీత్‌ను రోహ్‌తక్‌ జైలులో కలిసే ప్రయత్నం చేశారు. జైలు వర్గాలు ఆమెను అనుమతించకపోవడంతో డేరా అనచురుల వాహనంలో వెళ్లిన ఆమె మళ్లీ కనిపించలేదు.