స్కోచ్ అవార్డు అందుకున్న మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మరో జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రసిద్ధ సంస్థ స్కోచ్ ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో మంత్రి కేటీఆర్‌ను సన్మానించింది. 49వ స్కోచ్ సమ్మిట్ సందర్భంగా ఢిల్లీలో మంత్రి కేటీఆర్ స్కోచ్ అవార్డును అందుకున్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నందుకు ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. అటు స్కోచ్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఐటీ స్టాళ్లను కేటీఆర్ సందర్శించారు.