సెమీస్‌లోకి వీన‌స్ ఎంట్రీ

తొమ్మిదవ సీడ్ వీన‌స్ విలియ‌మ్స్ అతిక‌ష్టంగా యూఎస్ ఓపెన్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో నెగ్గింది. వీన‌స్ 6-3, 3-6, 7-6 స్కోర్‌తో 13వ సీడ్ పెట్రా క్విటోవాపై విజ‌యం సాధించి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దూకుడు మీదున్న క్విటోవా ఓ ద‌శ‌లో వీన‌స్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది. తొమ్మిది నెల‌ల క్రితం క‌త్తి దాడితో బాధ‌ప‌డ్డ క్విటోవా ఈ టోర్నీలో మెరుగ్గా ఆడింది. తొలి సెట్‌ను గెలుచుకున్న వీన‌స్‌కు రెండ‌వ సెట్‌ను కోల్పోవాల్సి వ‌చ్చింది. క్విటోవా బ‌ల‌మైన గ్రాండ్ షాట్స్‌తో ఆక‌ట్టుకున్న‌ది. థ్రిల్లింగ్‌గా సాగిన మూడ‌వ సెట్‌లో వీన‌స్ టైబ్రేక‌ర్‌ను త‌న వ‌శం చేసుకున్న‌ది. సెమీస్‌లో సొలేన్ స్టీఫెన్స్‌తో వీన‌స్ త‌ల‌ప‌డుతుంది.