సూపర్‌ లగ్జరీ బస్సు బోల్తా, ఒకరు మృతి

నిర్మల్‌ జిల్లాలో ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు బోల్తా పడింది. నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్తున్న బస్సు.. డ్యాంగాపూర్‌ వద్ద ఆగి ఉన్న కారును ఢీకొని అదుపుతప్పి బోల్తా కొట్టింది. బస్సులో 38 మంది ప్రయాణిస్తుండగా.. ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హుటాహుటీన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి.. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.