సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని పంటల హబ్ గా మారుస్తున్నారు

భూ రికార్డుల ప్రక్షాళన, శాస్త్రీయ పంటల సాగు, మద్దతు ధరలు, 24 గంటల విద్యుత్ సరఫరాతో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చి రాష్ట్రాన్ని పంటల హబ్ గా మారుస్తున్నారని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పెద్దేముల్ మండల స్థాయి రైతు సమన్వయ సమితి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రైతన్నల కష్టసుఖాలు తెలిసిన నేత అని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. ఎకరాకు పంటకు 4 వేల చొప్పున పెట్టుబడిని రెండు పంటలకు అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని, 500 కోట్ల మూలధనంతో రైతు సమాఖ్య ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. గ్రామ, మండల, జిల్లా రైతు సమన్వయ సమితులు రైతాంగానికి బాధ్యతాయుతంగా సేవలందించాలని సూచించారు.