సీఎం కేసీఆర్ ను కలిసిన అసెంబ్లీ కొత్త కార్యదర్శి

రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ వేదాంతం నర్సింహాచార్యులు సీఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా తనను కలిసిన నర్సింహాచార్యులును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం కు పొడిగించిన పదవీకాలం నిన్నటితో ముగియడంతో ఆయన పదవీ విరమణ చేశారు. దీంతో, నర్సింహాచార్యులును అసెంబ్లీ కార్యదర్శిగా నియమించారు.