సీఎం కేసీఆర్‌ కు జైట్లీ కృతజ్ఞతలు

జీఎస్టీ కౌన్సిల్ 21వ సమావేశం హైదరాబాద్ లో సక్సెస్‌ ఫుల్‌ గా సాగిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్టీ సమావేశం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన సీఎం కేసీఆర్‌ కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. వర్క్స్‌ కాంట్రాక్ట్స్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ రాసిన లేఖపై చర్చించిన కమిటీ, గత సమావేశంలోనే వాటిపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించిందని చెప్పారు. వర్క్స్ కాంట్రాక్ట్స్ జాబితాలో ప్రభుత్వం భవనాల నిర్మాణం తదితర అంశాలను కూడా చేర్చాలన్న కేసీఆర్ సూచనలపై తదుపరి సమావేశంలో చర్చించనున్నట్లు జైట్లీ తెలిపారు.

హైదరాబాద్ హైటెక్ సిటీలోని హెచ్ఐసిసి లో జీఎస్టీ కౌన్సిల్ 21వ సమావేశం తర్వాత జైట్లీ మీడియాతో మాట్లాడారు.