సినీ కళాకారులకు అండగా ఉంటాం

సినీ కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన  తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యునియన్ రజతోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సినీ డబ్బింగ్ ఆర్టిస్టులకు ప్రభుత్వం తరపున పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. పలువురు సినీ పెద్దలు కింది స్థాయి కళాకారుల అభివృద్ధికి ఆర్ధిక సహాయం అందిచాల్సిన అవసరం ఉందన్నారు.