సినిమా రంగాన్ని సంస్కరించిన వ్యక్తి ఏఎన్‌ఆర్‌

సినీ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటదని సీఎం కేసీయార్ స్పష్టం చేశారు. అక్కినేని నాగేశ్వర్‌రావు తెలుగు సినిమా స్థాయిని పెంచారని అన్నారు. అక్కినేని అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. హైదరాబాద్‌లో అక్కినేని స్టూడియో నిర్మించిన తర్వాత మిగతావారు స్టూడియో కట్టారని గుర్తుచేశారు. శిల్పాకళావేదికలో దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయగా..సీఎం కేసీఆర్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.అక్కినేని అవార్డు అందుకున్న దర్శకుడు రాజమౌళికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సోదరుడు వెంకట్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.