సిద్దిపేటలో భారీ వర్షం

సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. హుస్నాబాద్ లో వరుణుడు దంచికొట్టగా..పలు ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. భారీ వర్షానికి హుస్నాబాద్‌ లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఆకస్మిక వానలతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.