సిగరెట్ల దోపిడీ కేసులోకంజర్ గ్యాంగ్ అరెస్ట్

హయత్ నగర్ లో లారీలో తరలిస్తున్న రూ. 4 కోట్ల విలువ చేసే సిగరెట్లను దోపిడీ కేసును పోలీసులు చేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెందిన కంజర్ గ్యాంగ్ సిగరెట్లను దోపిడీ చేసిందన్నారు. మొత్తం 24 మంది ముఠా సభ్యులు దోపిడీకి పాల్పడ్డారని.. అందులో నలుగురిని అరెస్టు చేశామన్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.