సాలార్జంగ్ మ్యూజియంకు సరికొత్త హంగులు

లక్షలాదికళాఖండాలకు నెలవు.. చారిత్రక ఆనవాళ్లకు సజీవ సాక్ష్యమైన సాలార్జంగ్ మ్యూజియానికి మరిన్ని హంగులు దిద్దుతున్నారు. ఇప్పటికే 38 గ్యాలరీల్లో సందర్శకులను అలరిస్తున్న ఈ మ్యూజియంలో మరో రెండు కొత్త గ్యాలరీలు చేరాయి. ఇదివరకు ఉన్న పిల్లల గ్యాలరీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో పలు ఆసక్తికరమైన గేమ్స్ తో ను ఏర్పాటు చేశారు. ఇక మరో గ్యాలరీలో తొలి శతాబ్దానికి చెందిన నాణాలతో పాటు పలురకాల నోట్లు,  ఆయాకాలానికి చెందిన నాణేలు, వాటి విశిష్టతను తెలిపేలా సందర్శనకు ఉంచారు.

వీకెండ్స్ లో ఈ కొత్త గ్యాలరీలను చూసేందుకు సందర్శకులు భారీగా మ్యూజియానికి వస్తున్నారు. రాజుల కాలంలో వాడిన పురాతన నాణేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. స్కూల్ విద్యార్థులు సైతం కొత్త గ్యాలరీలను సందర్శించి వాటి విశేషాలు తెలుసుకుంటున్నారు.

గత నెల 21 నుంచి ప్రారంభమైన చిల్డ్రన్స్ గ్యాలరీకి మంచి స్పందన వస్తుందని మ్యూజియం అధికారులు తెలిపారు. నూతన గ్యాలరీలలో 7 వేలకు పైగా వస్తువులను ప్రదర్శనకు ఉంచామన్నారు. వీటితో పాటు 50 ఏళ్ల కాలం నాటి రైలుకు మరమ్మత్తులు చేయించి మళ్లీ ప్రదర్శనకు ఉంచామన్నారు.

ఇప్పటికే లక్షలాది కళాఖండాలకు నెలవైన సాలర్ జంగ్ మ్యూజియం నూతన గ్యాలరీల ఏర్పాటుతో సందర్శలకును మరింతగా ఆకట్టుకోనుంది. నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ గ్యాలరీకి దసరా సెలవుల్లో తీసుకువచ్చేందుకు పేరేంట్స్ తో పాటు స్కూల్ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.