సమాజ అభివృద్ధికి జర్నలిస్టులు కృషి చేయాలి

సమాజంలో అన్ని వర్గాల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తున్నారని స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అపూర్వమని ప్రశంసించారు. సమాజ అభివృద్ధికి జర్నలిస్టులు కృషి చేయాలని సూచించారు. వరంగల్ లో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో  జర్నలిస్టులకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. స్పీకర్ మధుసూదనాచారితో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.