సమగ్ర భూ సర్వేలో వక్ఫ్ భూములు గుర్తించాలి

రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్‌ కమిటీ హైదరాబాద్ సమావేశమైంది. కబ్జాకు గురైన వక్ఫ్‌ బోర్డ్ భూముల క్రమబద్దీకరణపై సభ్యులు చర్చించారు. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర భూ సర్వే ద్వారా వక్ఫ్‌ బోర్డ్ భూములను కూడా గుర్తించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే షకీల్‌ తెలిపారు. అలాగే మైనారిటీ కార్పోరేషన్‌ లో లోన్స్‌ అమలు, ఉర్దూ అకాడమీ పనితీరుతో పాటు ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌, మైనారిటీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుపై చర్చించామన్నారు ఎమ్మెల్యే షకిల్‌.