సన్ నెట్ వర్క్ చేతికి స్పైడర్ రైట్స్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ ఈ నెల 27వ తేదిన విడుద‌ల కానుంది. ఇక‌ తమిళ శాటిలైట్ హక్కులను సన్ టీవీ వారు సొంతం చేసుకుంది. భారీ మొత్తాన్ని చెల్లించి ఈ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది స‌న్ నెట్ వ‌ర్క్. కాగా హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఈ వేడుకను నిర్వహించ‌నున్నారు.