సంచార పశు వైద్యశాలలకు సీఎం కేసీఆర్ శ్రీకారం

రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలిచింది..! హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వేదికగా సంచార పశు వైద్యశాలలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు..! తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు..! ఒక్క ఫోన్ కాల్‌తో పశు వైద్యులు రైతుల ఇంటి వద్దకే వచ్చి సేవలందిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు..!

సమగ్రాభివృద్ధితో సంక్షేమ పథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. బంగారు తెలంగాణకు బలమైన పునాది వేస్తున్న సీఎం కేసీఆర్‌ మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు.దేశంలో ఎక్కడా లేని విధంగా సంచార పశు వైద్యశాలలు ప్రారంభించి తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో సంచార పశు వైద్యశాలల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సీఎం కేసీఆర్‌తో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహ్మా రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ఎంపీలు కేకే, దత్తాత్రేయ, మేయర్ బొంతు రామ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంచార పశు వైద్య శాలలను సీఎం కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంచార వైద్య శాలల్లోని సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం సంచార పశు వైద్యశాల టోల్ ఫ్రీ నంబర్‌ 1962కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.

గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం దిశగా పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రస్థానంలో ఇది మరో మైలురాయిగా నిలవనుంది. దేశంలోనే ఆదర్శ పాలన సాగిస్తోన్న సీఎం కేసీఆర్… రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధికి గట్టి పునాది వేస్తున్నారు. సమైక్య పాలనలో కుదైలైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహర్ధశ పట్టేలా పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటికే పాడి పశు సంపదను పెంచేందుకు అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది గొర్రెలను ఉచితంగా గొల్ల కురుమలకు పంపిణీ చేశారు. అటు టీఆర్‌ఎస్ సర్కారు ఏలుబడిలో పాడి పరిశ్రమ కూడా గణనీయంగా వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో పాడిరైతుల కోసం సంచార పశు వైద్యశాలలను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో మొత్తం 100 సంచార పశువైద్యశాలలను ప్రారంభించామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సంచార పశు వైద్యశాలల ప్రారంభోత్సవం సందర్భంగా సుదీర్ఘంగా ప్రసంగించిన సీఎం కేసీఆర్… తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేయడమే తమ సర్కారు లక్ష్యమని స్పష్టం చేశారు. అందులో భాగంగానే సంచార పశు వైద్యశాలలు ప్రారంభించామన్నారు. ఇకపై పాడి రైతులు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు పశువులకు వైద్య సేవలు అందుతాయన్నారు. దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 18 లక్షల పై చిలుకు గొర్రెలు పంపిణీ చేశామన్నారు. దసరా పండగ నాటికి 20 లక్షల గొర్రెల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ఈ ఏడాది 70 కోట్ల చేప పిల్లలను పెంచబోతున్నామని తెలిపారు.

రైతు సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ సర్కారు సాగునీటి రంగానికి పెద్దపీఠ వేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతుకు కావల్సింది సాగునీరు, పెట్టుబడి, గిట్టుబాటు ధర అన్నారు. అందుకే గిట్టుబాటు ధర కల్పించేందుకే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కానీ కొందరు నాయకులు సమన్వయ సమితులపైన కూడా కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు పెట్టుబడి కోసం ఎకరాకు రూ.8 వేలు ఇవ్వాలన్న ఆలోచన ఎప్పుడైనా గతంలో ఏ పార్టీలకైనా వచ్చిందాన అని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి పథకాన్ని మాజీ ప్రధాని దేవేగౌడ ప్రశంసించారని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇకపై పాడి రైతులు పశువుల వైద్యం కోసం పాట్లు పడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. సంచార పశు వైద్యశాలలు నెలకు ఎన్ని ట్రిప్పులు తిరగాలో నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరమైన చోట వెంటనే వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఇక రాష్ట్రంలో సంచార పశు వైద్య శాలలు ప్రారంభించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.