శరవేగంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం

నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ చెప్పారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ప్రస్తుతం 50వేల ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మరో లక్ష ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కృష్ణా నగర్ తండాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆమె పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి, కలెక్టర్ సత్యనారాయణను, అధికారులను చిత్రా రామచంద్రన్ అభినందించారు.