వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు

సీఎం కేసీఆర్ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. నార్మల్ డెలీవరీలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఏఎన్ఎంలు, అంగన్ వాడీలదేనని స్పష్టం చేశారాయన. ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి కృషి చేసే ఏఎన్ఎంలకు అవార్డులు ఇస్తామన్నారు. సిద్దిపేటలో ఏఎన్ఎం ఆన్ లైన్ యాప్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.