వేములవాడలో రాజరాజేశ్వరి దేవిగా మహాలక్ష్మి

వేములవాడ రాజన్న ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పండుగ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కల్యాణ మండపం వద్ద ఆయుధ పూజ నిర్వహించారు.  దసరా వేళ అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.